ప్రకాశంలో జూపూడి యాక్టివ్..?

0 6

ఒంగోలుముచ్చట్లు:

వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మళ్లీ యాక్టివ్ అయినట్లే కనపడుతుంది. పార్టీ లో చేరిన నాటి నుంచి మౌనంగా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ వాయిస్ ను వినిపిస్తున్నారు. త్వరలో అనేక పదవులు భర్తీ కానుండటంతో జూపూడి ప్రభాకర్ రావు తిరిగి యాక్టివ్ అయ్యారంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం త్వరలోఎమ్మెల్సీ పదవులతో పాటు, వివిధ నామినేటెడ్ పోస్టులుకూడా జగన్ భర్తీ చేయనుండటమే.జూపూడి ప్రభాకర్ రావు 2014 ఎన్నికలకు వరకూ వైసీపీలోనే ఉన్నారు. కొండపి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం హయాంలో పొందారు. ఐదేళ్ల పాటు జగన్ ను జూపూడి ప్రభాకర్ రావు టార్గెట్ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో జూపూడి ప్రభాకర్ రావు తిరిగి వైసీపీ గూటిలోకి సులువుగానే చేరిపోయారు.పార్టీలో చేరి దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తున్నా జూపూడి ప్రభాకర్ రావు పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. పార్టీ కూడా ఆయనను పట్టించుకోవడం లేదన్న టాక్ ఒక దశలో వినపడింది. తన సొంత నియోజకవర్గమైన కొండపికి కూడా జూపూడి ప్రభాకర్ రావు దూరంగానే ఉన్నారు. కొండపి ఇన్ చార్జి పదవిని ఇవ్వాలని ఆయన పార్టీ పెద్దల వద్ద డిమాండ్ పెట్టినట్లు తెలిసింది.కొండపి నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉండటంతో మధ్యే మార్గంగా తనకు ఇవ్వాలని కోరుతున్నారు. మాదాసు వెంకయ్య, అశోక్ బాబుల మధ్య వైరం రోజురోజుకూ పెరుగుతుండటంతో జూపూడి ప్రభాకర్ రావు తనను ఇన్ ఛార్జిని చేయాలని మంత్రి బాలినేనిని కోరినట్లు తెలిసింది. దీంతో పాటు జగన్ ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశతో జూపూడి ప్రభాకర్ రావు ఉన్నారు. అందుకే ఇటీవల ఆయన యాక్టివ్ అయ్యారంటున్నారు. చంద్రబాబు ను విమర్శిస్తూ ఆయన మీడియా సమావేశం పెట్టడం వెనక కూడా వైసీపీలోని కొందరి పెద్దల ప్రోత్సాహం ఉందంటున్నారు. మరి జూపూడి ప్రభాకర్ రావు అనుకున్నది సాధిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Jupudi active in Prakashan ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page