ప్రజా ప్రయోజనాల కోసం దాతలు సేవలు స్ఫూర్తి దాయకం  జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు

0 14

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా ,గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ కు సుదీర్ఘ మైన చరిత్ర ఉంది.ఆనాడు దివంగత మహానేత సవేరా హోటల్ అధినేత అల్లా రెడ్డి శ్యామ సుందర రెడ్డి స్థల దాతృత్వం చేసి, ఆనాటి హంగులు తో సర్వాంగ సుందరంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ,శ్యామ్ సుందర్ రెడ్డి మామా దువ్వూరు నారాయణ రెడ్డి  పేరు పెట్టి, గూడూరు ప్రజలకి అంకితం చేశారు. ఈ భవనంలో ఎన్నో వివాహాలు, పాటల కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో రాజకీయ పార్టీల సమావేశాలు ,మరీ ఎన్నో కార్యక్రమాలు నిర్విరామంగా జరిగేవి.ఇలాంటి చరిత్ర ఉన్న డి ఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్ శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో, గూడూరు సబ్ కలెక్టర్ రోనంకి గోపాల కృష్ణా ఇటీవల కాలంలో  కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు.వెంటనే కమ్యూనిటీ హాల్ కమిటీ పెద్దలు అయినా అల్లా రెడ్డి రవి కుమార్, డాక్టర్ జనార్దన్ రెడ్డి, మైథిలి రమణ బాబు, తిప్పార పాడు గ్రామానికి చెందిన సుబ్బా రెడ్డి లతో చర్చించి,దాతల సాయం తో కమ్యూనీటి హాల్ కు పూర్తి స్థాయిలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. వెంటనే మరమ్మతులు చేపట్టి, అతి కొద్ది నెలల వ్యవధిలో 9 లక్షల రూపాయల వ్యయంతో పనులు పూర్తి చేశారు. అన్నీ వసతులతో ఆధునీకరించిన డి ఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్ ను  జిల్లా  కలెక్టర్ కె. వి .ఎన్ చక్రధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఎంతో మంది దాతలు, ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ,ఆదర్శంగా నిలుస్తున్నారు అని వారి సేవలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన డి ఎన్ ఆర్ కమ్యూనిటీ భవనం ను 9 లక్షల రూపాయల వ్యయంతో అదునికరించి, ప్రజా ప్రయోజనాల కోసం తీసుకొని రావడం శుభపరిణామం అన్నారు. భవన నిర్మాణ పనులకు సహకరించిన కమిటీ వారికి,సభ్యులు,దాతలకు అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరెంధర్ ప్రసాద్, గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ, డి ఎన్ ఆర్ కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి, మైథిలి రమణ బాబు,సుబ్బా రెడ్డి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Donor services for the public good are inspiring
District Collector KVN Chakradhar Babu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page