ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలి

0 9

-జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల ముచ్చట్లు :

 

- Advertisement -

ప్రజల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు.   శనివారం క్యాంపు కార్యాలయంలో అంగన్ టీచర్లు, ఆయాల కొరకు వివిధ దాతృత్వ సంస్థలు సరఫరా చేసిన సానిటైజర్, ఫేస్ షీల్డ్, మాస్కుల పంపిణి చేశారు.   ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడతూ,  వర్షాకాలం ప్రారంభమై వాతావారణంలో సంభవించే మార్పుల వలన ప్రజలు మలేరియా, డెంగ్యూ వంటి అనారోగ్యాలకు పాల్పడకుండా, రోడ్లపై ఇళ్లలో నీరు నిలవకుండా చూడాలని అన్నారు. అనారోగ్యాల బారిన పడి అప్పులు తీసుకువచ్చి వైద్యం చేయించుకునే దుస్థితి కలుగకుండా ఇంటి లోపల, బయట ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించడంలో అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిలా మహిళలు, పిల్లలు, వయోవృద్దుల సంక్షేమ అధికారి నరేష్ , జిల్లా పిల్లల హక్కుల పరిరక్షణ అధికారి హరీస్, సిడిపి వీరలక్ష్మీ , అంగన్ వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గోన్నారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Government welfare programs must succeed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page