బాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్

0 14

తుంగతుర్తి  ముచ్చట్లు:
మంత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు  తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ స్పందించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం అవాస చాకలిగూడెం కు చెందిన దర్శనం సతీష్  ప్రమాదవశాత్తు ఎనిమిది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయనకు ముగ్గురు ఆడపిల్లలు అక్షిత (5౦౦ ), లాస్య (4), బేబీ (8 నెలలు).  ఆ కుటుంబ పరిస్థితి గురించి ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ కి  ట్వీట్ చేశారు. వెంటనే మంత్రి కేటీఆర్  స్థానిక శాసనసభ్యుడు డా.గాదరి కిశోర్ కుమార్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. దాంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముగ్గురు చిన్నారుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కొక్కరి మీద రూ. యాభై వేల రూపాయలు  ఫిక్సీడ్ డిపాజిట్ తో పాటు తక్షణ సాయం క్రింద యాభై వేల రూపాయలు దర్శనం శిల్పకు ఆర్థికసాయం అందజేశారు. అలాగే దర్శనం శిల్పకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలలో చేర్పించి, ఉండడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని అన్నారు, పిల్లలకు నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Gadri Kishore Kumar, an MLA who supported the victim’s family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page