భార్యను చావబాదిన పోలీస్ కానిస్టేబుల్

0 21

విజయవాడ ముచ్చట్లు:
కంచికచర్ల మండలం కీసర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సునీల్ అనే పోలీస్ కానిస్టేబుల్ భార్య నవ్యపై తీవ్రంగా దాడిచేశాడు. కీసర గ్రామానికి చెందిన సునీల్ వత్సవాయి పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సునీల్ తల్లి ఇటీవల అధికార పార్టీ తరపు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొంతకాలంగా సునీల్, నవ్య మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సునీల్ తన భార్యను విచక్షణా రహితంగా దాడి చేశాడు.దీంతో బంధువులు ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే నవ్య వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. తనను కొట్టమని అత్తే తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. సునీల్‌కు జగ్గయ్యపేటకు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, అడ్డు తొలగించుకునేందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ్య దగ్గర వాంగ్మూలం తీసుకున్న నందిగామ పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసే ఇలా దాడికి పాల్పడటం దారుణమని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సునీల్‌ను కఠినచర్యలు తీసుకోవడంతో పాటు అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Police constable who killed his wife

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page