భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దుల కేటాయింపు

0 9

-తిరుమ‌ల‌లో గ‌దుల రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్లు ప్రారంభించిన అద‌న‌పు ఈవో   ఏ.వి.ధ‌ర్మారెడ్డి

 

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

 

- Advertisement -

భ‌క్తుల సౌక‌ర్యార్థం శ‌నివారం ఉద‌యం నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల ద్వారా వ‌స‌తి గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంద‌ని అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని సిఆర్‌వో వ‌ద్ద అద‌న‌పు ఈవో పూజ‌లు నిర్వ‌హించి కౌంట‌ర్లు ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో వ‌స‌తి కొర‌కు సిఆర్‌వో వ‌ద్ద భ‌క్తులకు పేర్లు రిజిస్ట్రేష‌న్ మ‌రియు గ‌దులు కేటాయిస్తున్నార‌న్నారు. సిఆర్‌వో వ‌ద్ద భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండ‌టం, పార్కింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డం వ‌ల‌న ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. కావున భ‌క్తుల‌కు మ‌రింత త్వ‌రిత‌గ‌తిన పేర్లు న‌మోదు, గ‌దుల కేటాయింపు కొర‌కు తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల‌లో కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.ఇందులో భాగంగా సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు, రాంభ‌గిచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ నందు రెండు కౌంట‌ర్ల‌లో భ‌క్తులు వ‌స‌తి కోర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు.

 

 

 

పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేయ‌బ‌డుతుంద‌ని చెప్పారు. అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద రుసుం చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చ‌న్నారు. ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో సిఇ  నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు ఆర్ – 1  లోక‌నాథం, ఆర్‌-2 బాస్క‌ర్‌, విజివో  బాలిరెడ్డి, ఏఈవోలు  రాజేంద్ర‌కుమార్‌,  మోహ‌న్‌రాజు, సూప‌రింటెండెంట్లు  సోమ‌శేఖ‌ర్‌,  ర‌ఘురామ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Allocation of accommodation rooms more easily for devotees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page