ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ భేటీ పలు ఉత్పత్తుల పన్ను తగ్గింపు

0 70

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

న్యూఢిల్లీలో జరిగిన 44 జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కరోనా ఔషధాలు, పలు వైద్య పరికరాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కరోనా ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలపై పన్నుల తగ్గింపు వుంటుందని ప్రకటించారు. అంబులెన్స్ సేవలపై 28శాతం జీఎస్టీ నుంచి 12 శాతానికి తగ్గింపు, టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు వుంటుంది. అలాగే, రెమ్డెసివిర్ ఔషధంపై జిఎస్టీ 12% నుంచి 5% శాతానికి తగ్గింపు, ఆక్సిజన్ యూనిట్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జిఎస్టీ 12% నుంచి 5% జీఎస్టీ తగ్గింపు ప్రకటించారు. కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జిఎస్టీ 5%శాతానికి తగ్గింపు. వ్యాక్సిన్లపై 5% జిఎస్టీ కొనసాగిస్తారు. ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జిఎస్టీ 18% నుంచి 5% శాతానికి తగ్గించారు. ఈ జిఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు  సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:End GST Council Meeting
Tax deduction for many products-

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page