మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన మామ

0 18

విజయనగరం ముచ్చట్లు :

 

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని కిరాతకంగా హతమార్చాడో కసాయి. వరుసకు మేనకోడలిని గొంతుకోసి అమానుషంగా అంతమొందించాడు. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. వరుసకు మేనమామ అయ్యే వినోద్ మూడేళ్ల చిన్నారి భవ్యశ్రీపై దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో చిన్నారి గొంతుకోసి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి నిద్రపోయిన కూతురు తెల్లారేసరికి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు వినోద్‌కి మతిస్థిమితం సరిగ్గా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Uncle choked three-year-old child

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page