విలువైన 25 ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ వితరణ

0 6

కడప ముచ్చట్లు:
జిల్లాకు ప్రకాశం జిల్లా మిడ్ వెస్ట్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ వారు రూ.30 లక్షల విలువైన 25 ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ అందించడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ చాంబర్లో మిడ్ వెస్ట్ గ్రానైట్ మైనింగ్ కంపెనీవారు 25ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు అందించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ మాట్లాడుతూ…   కడప ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో ప్రకాశం జిల్లా మిడ్ వెస్ట్ మైనింగ్ కంపెనీ చైర్మన్ రాఘవరెడ్డి స్పందించి గత నెలలో జిల్లాకు 25 ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ వితరణ చేశారు. మరలా నేడు నిమిషానికి 10లీటర్ల సామర్ధ్యం కలిగిన మరొక 25 ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ అందించడం సంతోషకరమని వారి దాతృత్వం అభినందనీయమన్నారు.  కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో కోవిడ్ చాలా తీవ్రమవుతున్న ఈ పరిస్థితులలో ఆక్సిజన్ ఎంతో అవసరం వుందని ఈ నేపథ్యంలో కొరతను అధిగమించడానికి జిల్లా కలెక్టర్ తనకు తెలుపడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా మిడ్ వెస్ట్ మైన్స్ కంపెనీ వారిని కోరగా..  ఆ మేరకు వారు జిల్లాకు గత నెల 25, నేడు మరొక 25 మొత్తం 50 ఆక్సిజన్ ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిడ్ వెస్ట్ గ్రానైడ్ మైనింగ్ కంపెనీ వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కోవిద్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు కూడా బాధ్యతాయుతంగా సహకరించాలని, ప్రభుత్వ నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లరాదని, ఖచ్చితంగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కె.సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మిడ్ వెస్ట్ మైనింగ్ కంపెనీ ప్రతినిధి కె. దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్ సంబటూరు ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

- Advertisement -

Tags:Distribution of valuable 25 oxygen concentrators

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page