వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాండి కేంద్రానికి మంత్రి హరీష్ రావు వినతి

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జరిగిన 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ అవసరాలకు అనుగుణంగా  వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై  జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన  పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు.
దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని  త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలి.   అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్   ఉత్పత్తి కావడం లేదని,  దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19  చికిత్స కు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై  మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఎఫ్ఆర్ బీఎం పెంచండి
కోవిడ్ ఉదృతి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సాగుతోందని, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకుకొనసాగుతుందో తెలియదన్నారు. మే నెలలోలాక్ డౌన్ వల్ల 4100కోట్లు  ఆదాయాన్ని కోల్పోయమని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ ఆర్ బీఎం ను 4  నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఏఫ్ ఆర్ బీఎం పెంపు వల్ల  దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Accelerate vaccine delivery
Minister Harish Rao’s request to the Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page