సబ్ కలెక్టర్ వీడ్కోలు సభ  హాజరైన జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్

0 33

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా,గూడూరు సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ   పాడేరు ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి బదిలీ అయినా విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే  సబ్ కలెక్టర్ రొనంకి గోపాలకృష్ణ కు గూడూరు డి ఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా  ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హాజరై సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ  దంపతులను పలకరించి  పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.  డీఎన్ ఆర్ కమ్యూనిటీ హాల్లో సబ్ కలెక్టర్ జరిగిన వీడ్కోలు సభలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ గూడూరు సబ్ కలెక్టర్ గా గోపాలకృష్ణ భాద్యతలు చేపట్టి 20 నెలల్లో డివిజన్లోని ప్రజల సమస్యలు పరిష్కరించి సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న లే అవుట్ ఏర్పాటు చేయడంలో , జిల్లాలోనే 9 అంకణాల్లో ఏర్పాటు చేసి ఎక్కడా లేనివిదంగా గూడూరు పట్టణ ప్రజలకు గాంధీ నగర్లో 5000మంది లబ్దిదారులందరికీ పట్టాలందించారన్నారు అని మా ఆయనను అభినందించారు. కరోనా సమయంలో సమర్థవంతంగా పనిచేసారన్నారు. బదిలీపై వెళుతున్న ఐటీడీఏ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తారని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు . ఈ సందర్భంగా సబ్కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ తన విధి నిర్వహణలో అన్నీ విధాల  సహకారాలు  అందించిన  జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూశాఖ అధికారులు ,సిబ్బంది, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కి ధన్యవాదాలు తెలియజెస్తున్నాం అని  అన్నారు.అనంతరం సబ్ కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కావలి, నాయుడుపేట,ఆత్మకూరు డివిజన్ల ఆర్డీ ఓలు,గూడూరు డివిజన్లోని అన్ని మండలాల రెవిన్యూఅధికారులు,సిబ్బంది,గూడూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి మణికుమార్ డాక్టర్ జనార్దన్ రెడ్డి,డాక్టర్ రోహిణీమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Sub Collector Farewell House
District Collector, Joint Collector present

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page