స్వగ్రామానికి చేరిన వలస జీవి మృతదేహం

0 10

జగిత్యాల ముచ్చట్లు :

 

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నరసింహుల పల్లి కి చెందిన ఇందారపు దుబ్బయ్య (41) ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లగా, మే 8 న అతను నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అతని గది లొనే మృతి చెందాడు. అక్కడ అతనితో పని చేసే వారి ద్వార వారి కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో కువైట్ లో ఉంటున్న మృతుని సోదరుడు ఇందారపు గంగాధర్ మృత దేహం తెప్పించేందుకు గల్ఫ్ జేఏసీ ప్రతినిధి, గల్ఫ్ తెలంగాణ తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి కోరడంతో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్ మృతుడి భార్య , కుమారుడికి సంబంధించిన పత్రాలు తయారు చేసి మురళీధర్ రెడ్డి కి చేరవేయడంతో శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దుబ్బయ్య మృత దేహం గ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధు, మిత్రుల రోదనలు మిన్నంటాయి. గల్ఫ్ జేఏసీ ప్రతినిధి మురళీధర్ రెడ్డి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరడంతో అధికారులు నర్సింహులపల్లి వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యాన్ని కల్పించారు.

- Advertisement -

15 ఏళ్లుగా అక్కడే..

దుబ్బయ్య గత 15 ఏళ్లు బెహ్రెయిన్ వెళ్లిన 15 ఏళ్ల నుంచి ఉద్యోగం, సరైన వేతనం లేని కారణంగా ఇండియాకు రాక పోవడమే కాకుండా కుటుంబ పోషణకు డబ్బులు పంపకపోవడంతో భార్య పద్మ కూలీ పనికి వెళ్లి మానసిక వికలాంగులైన ఒక కుమారుడిని పోషించుకుంది. అయినప్పటికీ తన భర్త మృతదేహం అక్కడే ఖననం చేస్తామన్న తన భర్త మృతదేహం కావాలని భార్య పద్మ గల్ఫ్ ప్రతినిధుల ద్వారా రాయబార కార్యాలయాలకు చేసుకున్న విజ్ఞప్తుల మేరకు స్పందించిన అధికారులు మృతదేహాన్ని ఇండియాకు తరలించారు. పేదరికంలో మగ్గుతున్న పద్మ , కుమారుడి పోషణకు తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా అంబులెన్స్ అందించడంలో తమకు సహకరించిన చిట్టి బాబు కు మురళీధర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అంజన్న, ఎం బి రెడ్డికి, కువైట్ లో ఉన్న గంగాధర్ కి జగిత్యాల నౌషాద్ అలీ కి మురళీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The body of a migratory animal that reached its home village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page