కొత్తహంగులతో బోయకొండ ను తీర్చిదిద్దుదాం-మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో అభివృద్ది చేద్దాం

0 52

– పాలకమండళి సమావేశంలో తీర్మాణం
– కోవిడ్‌ తో మృతిచెందిన ఇద్దరు ఉద్యోగులకు నివాళులు

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద కొత్త హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేయాలని ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం బోయకొండ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల సహకారంతో కోట్లాది రూపాయాల నిధులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని,ఇ ంకనూ అవసరమైన పనులపై సమీక్షించారు. దేవస్థానం వద్ద వ్యివిధ హక్కులపై జరగబొయే వేలం పాటల్లో నిర్ణయించిన ధరకంటే తక్కువ బిడ్‌ ధరలతో కొట్‌ చేస్తే వాటిని రద్దు చేసి కొబ్బరి కాయలు విక్రయించడం, పూజా సామాగ్రి , చీరలు సేకరించడం వంటి పనులను ఆలయ సిబ్బందితో నిర్వహించేలా తీర్మాణించారు. కొండ కింద అవసరమైన అభివృధ్ది పనులకు అదనపు భూమి సేకరణకు ఆమోదించారు. కొండపైన డివైడర్‌ మద్యలో ఎలక్ట్రికల్‌ లైన్‌, రాజగోపురం ముందు విశ్రాంతి గది నిర్మాణానికి ప్రతిపాధన ఆమోదం,అవసరమైన అటవీ భూమి సేకరణ, తీర్థం బాటిల్‌ ప్రస్తుత ధర రూ:10 నుంచి రూ:20 కు పెంచుటకు తీర్మాణించారు. ఆలయ అభివృద్దికి్య సిబ్బందితో పాటు భక్తులు, ధాతలు కృషిచేయాలని కొరారు.

 

 

 

లచ్చిస్వామి, లావణ్యసేవలు మరువలేనివి…….

 

 

బోయకొండలో అర్చకుడిగా పనిచేస్తున్న కె. లక్ష్మణాచార్యులు( లచ్చిస్వామి) ,కార్యాలయ సిబ్బంది లావణ్య సేవలు మరువలేనివని చైర్మన్‌ శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి కొనియాడారు. ఇటీవల వీరిద్దరూ కోవిడ్‌కు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం బోయకొండ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. వీరిద్దరి చిత్రపటాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆలయ అభివృద్దికి వీరు ఎనలేని సేవలు చేసి అభివృద్దికి కృషిచేశారని, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. ఈ కార్యక్రమంలో ఈఓ చంద్రమౌళి, పాలకవర్గ సభ్యులు జి.వెంకటరమణారెడ్డి, రమేష్‌ నారాయణరెడ్డి, పూర్ణిమ, కనుగొండ,ఈశ్వరమ్మ, తదితరులున్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Let’s reshape Boyakonda with new twists and turns – let’s develop it in collaboration with Minister Peddireddy

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page