పుంగనూరు మండలంలో జ్వరాలపై సర్వే సమగ్రంగా నిర్వహించాలి -తహశీల్ధార్‌ వెంకట్రాయులు

0 108

పుంగనూరు ముచ్చట్లు:

 

 

గ్రామీణ ప్రాంతాలలో జ్వర పీడితులను గుర్తించే కార్యక్రమం సమగ్రంగా నిర్వహించాలని తహశీల్ధార్‌ వెంకట్రాయులు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి జ్వరబాధితులను గుర్తించాలన్నారు. జ్వరాల సర్వేలో కరోనా అనుమానితులు ఉంటే వారిని వెంటనే ఐసోలేషన్‌ హోం స్‌కు తరలించాలన్నారు. జ్వరాల సర్వేను నాణ్యతగా నిర్వహించకపోవడంపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తహశీల్ధార్‌ తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ సంజీవిని యాఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నారు. జ్వరాల సర్వేలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్‌డి కృష్ణవేణి, వెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌తో పాటు ఏఎన్‌ఎంలు, కార్యదర్శులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:A comprehensive survey on fevers in the Punganur zone should be conducted – Tahasildhar Venkatrayulu

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page