ప్రేమ పేరుతో మూడో పెళ్లి

0 178

తిరుపతి ముచ్చట్లు :

 

తాను అనాథనని నమ్మించి మూడో పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి లక్షల్లో గుంజుకొని పారిపోయింది. ఈ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన యువకుడు మార్కెటింగ్ జాబ్ చేస్తూ తిరుపతి సత్యనారాయణ పురంలో కాపురం ఉంటున్నాడు. నగరంలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే సుహాసిని తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. యువకుడు పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో 8 తులాల బంగారు నగలు ఆమెకు చేయించాడు. పెళ్లి తర్వాత తనను పెంచిన వారికి ఆరోగ్యం బాగా లేదనే పేరుతో మరో నాలుగు లక్షలు లాగేసింది. యువకుడి తండ్రి నుంచి మరో రెండు లక్షలు తీసుకుంది. ఈ విషయమై భర్త నిలదీయడంతో మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. విచారణ జరపగా ఆమెకు అది మూడో పెళ్లి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Third marriage in the name of love

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page