మహిళపై యాసిడ్ దాడి

0 21

మైలవరం ముచ్చట్లు :

 

పదేళ్లపాటు తనతో సహజీవనం చేసిన మహిళ తనను దూరం పెట్టడంతో అనుమానం వచ్చి యాసిడ్ దాడి చేసిన ఘటన కృష్ణ జిల్లా మైలవరం లో చోటుచేసుకుంది. గణపవరానికి చెందిన ఆ మహిళ భర్త 20 ఏళ్ల కిందటే మరణించాడు. అదే గ్రామానికి చెందిన గోపితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి కొన్నేళ్ళు జీవించారు. గోపి శారీరకంగా వేదిస్తుందడంతో అతని నుంచి విడిపోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చల్లా నాగరాజు డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. వారిద్దరూ మాట్లాడు కుంటు ఉండగా కిటికీ లో నుంచి చూసిన గోపి ఆమెపై యాసిడ్ పోశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Acid attack on woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page