వైభవంగా సీతారాముల కళ్యాణం

0 16

వాల్మీకిపురం ముచ్చట్లు :

 

స్థానిక పట్టాభి రామాలయంలో ఆదివారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. అంతకుమునుపు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై తదుపరి గణపతి హోమం, శాంతి హోమాలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఏకాంతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న దంపతులకు స్వామివారి ప్రసాదాలతో పాటు పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Sitaram’s marriage in glory

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page