ఆనందయ్యకు ఎంపీ ఆదాల అభినందనలు

0 26

నెల్లూరుముచ్చట్లు :

కరోన మందు సృష్టికర్త ఆనందయ్య కు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందనలు తెలిపారు. కరోనాకు మందును కనిపెట్టి ఎందరో రోగులకు స్వాంతన చేకూర్చిన ఆనందయ్య నెల్లూరు వాసి కావడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తరఫున విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సోమవారం ఆనందయ్య ను కలిశారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి సందేశాన్ని ఆయనకు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు తన వంతు కృషి చేయడం అభినందనీయమన్నారు. నెల్లూరు జిల్లాలోని  కృష్ణపట్నం  ఓడరేవు  తొలుత ప్రసిద్ధి చెందిందని పేరు రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుతో రెండవ సారి కృష్ణపట్నం గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కు ఆనందయ్య జిల్లా ప్రజలకు అందిస్తున్న సేవలు సంతోషకర విషయం అన్నారు. ఇలాగే జిల్లా వాసులతో పాటు అందరికీ స్వాంతన చేకూర్చాలని రంగారెడ్డి కోరారు. ఎంపీ ఆదాల తరఫున తనను కలిసినందుకు ఆనందయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  కొండ్రెడ్డి రంగారెడ్డి కి ఆనందయ్య కృతజ్ఞతలు కూడా తెలిపారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Congratulations to Anandayya MP Adala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page