ఆ భేటీల వెనుక రాజకీయాలు లేవు

0 12

అమరావతి   ముచ్చట్లు :
బంధుత్వం,మిత్రుత్వం ఉంటే పార్టీ జనరల్ సెక్రటరీ నడ్డాని కలవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని ,కేంద్ర మంత్రులని కలవడం వెనుక ఎటువంటి రాజకీయం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  మన స్టేట్ బడ్జెట్ కంటే వ్యవసాయ ఆర్థిక రుణ ప్రణాళిక ఎక్కువ ఉంది. చంద్రబాబు సమయంలో వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో వ్యవస్థల పట్ల ఏ విధమైన అవగాహన ఉంది. పెద్ద ఎత్తున ధాన్యం కొంటా అన్నారు. ఎక్కడ కొన్నారు. 1400 రూపాయలకి ధాన్యం కొనిపించలేని చేతగాని ప్రభుత్వమని అన్నారు.
రైతు భరోసా కేంద్రాలలో రైతుని ఆదుకునే దిక్కు లేదు. మీరు మిల్లర్లు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. మీరు రెండు నెలలకి కూడా డబ్బు ఇవ్వని కారణంగా మిల్లర్లకి అమ్ముకుంటున్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో డీఎంలు ఎంత కాలం నుంచి ఉంటున్నారు. ఒక్క సివిల్ సప్లైస్ లోనే ఇంత వైఫల్యం ఉంటే ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇల్లు ఇస్తున్నారు. ఇందులో అవినీతి జరిగింది.. చాలా చోట్ల పెద్ద ఎత్తున రేటు పెట్టి కొన్నారు. సరే ఇందులో 15 లక్షల  ఇళ్ళకి 1 లక్ష యాభై వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రోడ్లకి ఎన్ఆర్ఈజీఎస్ s ఫండ్స్ ఇస్తే తమలపాకు రోడ్లు వేశారు. ఇళ్ళకి 23 లక్షల కోట్లు ఇస్తే..ఇంకా ఇవ్వమంటున్నారు. మోడీ వ్యాక్సిన్లు వేయాలి,ఇల్లు కట్టాలి మరి మీరేం చేస్తారని అయన ప్రశ్నించారు.

ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం దోపిడీని స్ట్రక్చరైజ్ చేసింది.దీని ముందు చంద్రబాబు పని చేయడు. మోడీ ఇస్తున్న పథకాలకు కూడా జగనన్న పేరే. ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల్ని బీజేపీ గమనిస్తుంది. మీరు స్థలం ఇస్తున్నారు..కేంద్రం లక్షన్నర ఇస్తుంది..మీరొక లక్ష ఇవ్వండి..ఇసుక ఫ్రీగా ఇవ్వండి..సిమెంట్ తగ్గించి ఇవ్వండి. మీరు మధ్యలో రావద్దు..పేదవాడు చక్కగా ఇల్లు కట్టుకుంటాడని అన్నారు.
డబ్బంతా మేమిస్తే మీరు ఏం చేస్తారు..మీరు ఎన్నికయింది దేనికి. కేంద్ర ప్రభుత్వం పేదవారికి చేస్తున్న కార్యక్రమాలు మీరు చేయడం లేదు. సంక్షేమానికి అప్పు చేస్తున్న మీరు అభివృద్ధికి ఎందుకు అప్పు చేయరు. మోడీ అప్పు చేసింది.. రాష్ట్రాలలో అభివృద్ధిని చేయడం కోసమని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:There was no politics behind those visits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page