ఇవాళ్టి నుంచి హాల్ మార్క్‌ బంగారమే

0 90

ముంబై ముచ్చట్లు:

 

పసిడి ప్రేమికులకు అలర్ట్. రేపటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 15 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తోంది. దీంతో బంగారం కొనే వారు, అలాగే బంగారాన్ని విక్రయించే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలో జువెలర్స్ అందరూ కచ్చితంగా రేపటి నుంచి 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ కచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుతం దేశంలో విక్రయించే 40 శాతం బంగారానికి మాత్రమే హాల్‌మార్క్ ఉంది.కేంద్ర ప్రభుత్వపు కొత్త రూల్స్ వల్ల బంగారు కొనుగోలుదారులు నష్టపోవాల్సిన పని లేదు. హాల్ మార్క్ బంగారం అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం స్వచ్ఛత కచ్చితంగా తెలిసిపోతుంది. మోసం చేయడానికి ఉండదు.కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 15 నుంచే గోల్డ్ జువెలరీ హాల్ మార్క్ రూల్స్‌ను అమలులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే మోదీ సర్కార్ రెండు సార్లు ఈ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రేపటి నుంచి కచ్చితంగా ఈ రూల్ అమలులోకి రావొచ్చు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: From now on the hallmark is gold

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page