ఎస్సై చేతిలో మోసపోయిన మహిళా ఎస్సై

0 32

విజయవాడ ముచ్చట్లు:

 

ఎస్సై చేతిలో మహిళా ఎస్సై మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. ప్రియుడి మోసం భరించలేకపోయిన మహిళా ఎస్సై బలవన్మరణానికి యత్నించింది. సకాలంలో గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.విజయవాడ స్యతనారాయణపురం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై మరో ఎస్సైని ప్రేమించింది. ప్రియుడు మరో యువతిని వివాహం చేసుకున్నప్పటికీ ప్రేమాయణం కొనసాగించినట్లు తెలుస్తోంది.సదరు ఎస్సై భార్య, ప్రియురాలే కాకుండా మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు మొదలయ్యాయి. మహిళా ఎస్సై ప్రియుడిని నిలదీయడంతో మూడో మహిళ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళా ఎస్సైని తీవ్రంగా దుర్భాషలాడడమే కాకుండా స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమె తీవ్ర మనస్ధాపానికి గురైంది. ప్రియుడి మోసం భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విజయవాడలో తీవ్ర చర్చనీయాంశమైంది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Essay of a deceived woman at the hands of Essay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page