కంటతడి పెడుతున్న అన్నదాతలు..

0 19

భూముల సర్వే చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే….
వీఆర్వో ను బదిలీ చేసి మా గ్రామానికి నూతన వీఆర్వోకు బాధ్యతలు ఇవ్వాలని రైతులు డిమాండ్…

కౌతాళంముచ్చట్లు :

 

- Advertisement -

మండల పరిధిలోని నదిచాగి గ్రామంలోని భూములను సర్వే చేయాలంటే అధికారి రెవిన్యూ వీఆర్వో కు అంతో ఇంతో ఇస్తేనే సర్వే చేస్తాం. లేకుంటే లేదని తెగేసి చెప్తున్న ఆ గ్రామ రెవిన్యూ అధికారి. అన్నదాతలు విసుగుచెందుతున్నారు, భూముల సర్వే చేసేందుకు డీడీ తీసిన తరువాత భూముల సర్వే చేసేందుకు వీఆర్వో కు సర్వేయర్ కు మామూళ్లు ఇస్తేనే సర్వే చేసేందుకు దిగుతారు లేకుంటే పెండింగులో ఉంచుతారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలును పారదర్శకంగా అందించేలా గ్రామ సచివాలయలను నిర్మిచి నెలకొల్పింది. రైతన్నలకు ప్రజలుకు అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండేలా సచివాలయం సిబ్బంది నియామకాలను చేపట్టింది. కానీ అందులో పనిచేసే కొందరు సిబ్బంది లంచాలకు పాలుపడ్డారు మామూళ్లు పర్వనికి తెరదించుతున్నారు ప్రభుత్వ ఆశయానికి గండి కొడుత్తన్నారు. విఆర్వో రామాంజనేయులు, సర్వేయర్ శ్రీదేవి భూ సర్వే పేరుతో రైతుల నుంచి మామూళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతుల వద్ద నుంచి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు మముళ్ళను వాసులు చేసిన తర్వాతనే భూములను సర్వే చేసేందుకు ముందుకొస్తున్నారు అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల గ్రామంలో పలువురు రైతులు భూములను సర్వే చేయించుకోగా ఒక్కొక్క రైతునుంచి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే మీ పొలాలను సర్వే చేస్తామని సచివాలయం సర్వేయర్, వీఆర్వో తెగేసి చెబుతుండడంతో. రైతులు చేసేదేమీ లేక డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో లంచావతారమెత్తిన సదరు విఆర్వో, సర్వేయర్ పై జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోని మా గ్రామానికి కొత్త వీఆర్వో కు బాధ్యతలు ఇవ్వాలని రైతులు కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు…

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Tearful food donors ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page