కరోనాతో రుణాల మాఫీ

0 33

ముంబై ముచ్చట్లు:

 

కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది మరణిస్తున్నారు. ఇలా కోవిడ్ 19తో మరణించిన తన ఉద్యోగులకు ఒక బ్యాంక్ భారీ ఊరట కలిగిస్తోంది. వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది.ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కరోనాతో మరణించిన ఉద్యోగులకు.. వారి సీటీసీకి నాలుగు రెట్లు పరిహారం చెల్లిస్తోంది. దీంతోపాటు కుటుంబ సభ్యులకు రెండేళ్ల వరకు వేతనాన్ని అందిస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి విద్యానాధన్ ఈ విషయాలను వెల్లడించారు. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది.హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బైక్ లోన్ ఇలా ఉద్యోగులు ఎలాంటి రుణాలు తీసుకున్నా కూడా వాటిని మాఫీ చేస్తామని బ్యాంక్ తెలిపింది. గరిష్టంగా రూ.25 లక్షల వరకు మొత్తానికి మాఫీ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటి వరకు 20 మంది బ్యాంక్ ఉద్యోగులు కరోనాతో మరణించారని తెలిపింది.ఇలా మరణించిన వారి భాగస్వామి బ్యాంక్‌లో జాబ్ చేయాలని భావిస్తే.. వారికి ఉద్యోగం అందిస్తామని విద్యానాధన్ తెలిపారు. బ్యాంక్ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే రూ.2 లక్షలు అందిస్తామని, దీని ద్వారా నైపుణ్యాలు పెంచుకొని ఇతర జాబ్ కోసం ట్రై చేయొచ్చని వివరించారు. అలాగే 2 పిల్లల చదువు కోసం ప్రతి నెలా రూ.10000 అందిస్తామని పేర్కొన్నారు. ఇలా వారి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు డబ్బులు అందుతాయని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Debt forgiveness with Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page