కాంట్రాక్ట్ –ఔట్ సౌర్సింగ్ 30 శాతం పెంచాలనే నిర్ణయం హేతుబద్ధం కాదు      వంద శాతం పెంచాలి.. నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ డిమాండ్

0 14

హైదరాబాద్ ముచ్చట్లు :

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఒక లక్షా 20 వేల మంది కాంట్రాక్టు-ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను 30 శాతం కాదు. వంద శాతం పెంచాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సమావేశం డిమాండ్ చేసింది. నేడు బీసీ భవన్ లో కాంట్రాక్టు-ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సమావేశం నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్, రాష్ట్ర కాంట్రాక్టు-ఔట్సొర్సింగ్ సంఘం రాష్ట్ర కన్వినర్ బి. నరేష్ గౌడ్ల ఆద్వర్యం లో జరిగింది. సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సమావేశానికి 33 జిల్లా నాయకులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల పిఅర్సి   రిపోర్టు ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు పెంచినట్లు గా కాంట్రాక్ట్ -ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పెంచారు. ఇది న్యాయం కాదు. రెగ్యులర్ ఉద్యోగులకు “బేసిక్ పై” ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంటు ఉంటుంది. ఇంటి అద్దె ఉంటుంది. ఈ కాంట్రాక్టు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి అలవెన్సులు ఉండవు. పైగా ప్రస్తుతం ఇస్తున్న ఈ జీతాలు ఏడు సంవత్సరాల క్రితం నిర్ణయించారు. కావున 30 శాతం పెంచాలనే నిర్ణయం హేతుబద్ధంగా, శాస్త్రీయంగా లేదు. కాబట్టి ముఖ్యమంత్రి వీరికి 100 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. తక్కువ జీతంతో వీరి కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా ఉంటుందన్నారు.

- Advertisement -

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. నీల వెంకటేష్ మాట్లాడుతూ త్వరలో లక్షమంది ఉద్యోగులతో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. PRC ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం జరగదన్నారు. ఇటివల తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలోని రెగ్యులర్ – కాంట్రాక్ట్ – ఔట్సొర్సింగ్ ఉద్యోగులకు కొత్త పిఆర్సి ప్రకారం పెంచడం జరిగింది. ప్రస్తుతం మాకు 12,000 , ఇఎస్ఐ-పిఎఫ్ కట్ చేయగా 10,470 రూ మాత్రమే వస్తున్నది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాము. సమాన పనికి సమన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీతాలు పెంచాలని విజ్ఞప్తి డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో పి.విష్ణు ప్రియ, పి. పగిడాల సుధాకర్, జిల్లపల్లి అంజి, నికిల్ డానియల్, జే.సైదులు, ఎస్.ప్రసాద్, కే.రమేష్, కే. భాద్య నాయక్, ఈ.సైదులు, ఎన్.దుర్గయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:The decision to increase contract-outsourcing by 30 per cent is unreasonable
One hundred percent increase .. Unemployment Jack Chairman Neela Venkatesh demand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page