కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రుయాలో కోవిడ్ రోగులకు వైద్యం

0 18

– కోవిడ్ కేంద్రంలో పేషేంట్లను పరామర్శించిన భూమన

– మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశం

- Advertisement -

– వైద్యుల సేవలు స్లాగనీయంని ప్రశంస

 

తిరుపతి ముచ్చట్లు :

 

చేతిలో చేయి వేసి ఆప్యాయతగా పలకరిస్తూ, భుజం తట్టి నేనున్నానని మనో ధైర్యాన్నిస్తూ,
భయపడ వద్దని భరోసా ఇస్తూ తిరుపతి రుయా ఆసుపత్రిలో క్రొవ్విడ్ పేషేంట్లతో ఎమ్మెల్యే భూమన కరుణకర రెడ్డి మరో సారి మానవత్వం చాటుకున్నారు. రోగుల తరఫు బంధువుల కు అభివాదం చేస్తూ తాను అండగా ఉంటానని , ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని అనునయించారు. తిరుపతి రుయా ఆసుపత్రి కోవిడ్ సెంటర్ లో సుమారు 100 మంది రోగులకు సోమవారం పలకరించారు. వారి ఆరోగ్యస్థి, బాగోగులు గురించి వైద్యులు ను ఆరా దీస్తూ, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రుయా ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాయింట్స్.తిరుపతి రుయా ఆసుపత్రిలోని కోవిడ్ బారిన పడినటువంటి వారి పరిస్థితులను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షించారు.కరోనా గత కొద్దిరోజులుగా కరోనా కేసులతోతగ్గు ముఖం పట్టడం, రికవరీ రేటు పెరగడం శుభ శుచికం అన్నారు.రుయా ఆసుపత్రిలో వైద్యులు సేవలు శ్లాఘనీయమన్నారు.

 

 

 

 

 

పేదల ఆసుపత్రి రుయా ఆసుపత్రిలో చేరిన కొవిడ్ బారిన పడినటువంటి బ్రతికించారన్నారు.పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే రుయా ఆసుపత్రి నుండి కరోనా నుండి ఆరోగ్యంగా వెళ్ళిన వారే ఎక్కువ అని తెలిపారు.వైద్య సిబ్బంది పై నిందలు మోపడం పాపం అన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపి మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు.రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులను అభినందిస్తున్నాను అని తెలిపారు.మన కళ్ళ ముందే మన ఆత్మీయులు మరణిస్తే ఆసుపత్రి నిర్లక్ష్యం అనడం తప్పు అని తెలిపారు.వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ప్రమాదం సంభవిస్తుంది కనుక రోగుల అటెండర్లు ధైర్యం ఇవ్వాలని తెలిపారు.వైద్యుల పై ఆరోపణల చేయడం వల్ల వారి మనో ధైర్యాన్ని తీసినట్లు అవుతుందన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Healing of Kovid patients in Rua in addition to corporate hospitals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page