చౌడేపల్లె గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌ బాధ్యత కీలకం

0 27

చౌడేపల్లె ముచ్చట్లు:

 

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ది చేయడంలో సర్పంచ్‌ ల భాధ్యతలు కీలకమని పంచాయతీ రాజ్‌ గ్రామీణాబివృద్ది శాఖామంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్స్  ద్వారా సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పారిశుధ్యలోపం లేకుండా చూడాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి ప్రతి ఇంటి నుంచి గ్రీన్‌ అంబాసిడర్‌ల సహాయంతో చెత్త సేకరణ కేంద్రానికి తరలించి వాటిని సేంద్రీయ ఎరువుగా మార్చడానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వంద రోజులపాటు కొనసాగుతుందని సూచించారు. గ్రామాల్లో బహిరంగ మలమూత్ర విసరజ్జిన నిషేదం చేయాలని, ఇంకనూ మరుగుదొడ్లు లేని లబ్దిదారులను గుర్తించి వారి ద్వారా నిర్మించి వాటిని వినియోగంలోకి తేవాలని మంత్రి సూచించారు. అలాగే గ్రామాల్లోని వీధులు, రోడ్డుల్లో చెట్లను విరిగా పెంచి పర్యావరణంను రక్షించడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, మిగిలిన శాఖల ఉద్యోగుల సేవలను ప్రజలకు అందేలా పర్యవేక్షిస్తు గ్రామాల అభివృద్దికి తోడ్పాటునందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆశయసాధనలో అందరు సమిష్టిగా పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ వెంకటరత్నం, సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The responsibility of the Sarpanch is crucial in the development of the villages of Chaudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page