జీవో నెం.72ను కొట్టివేసిన హైకోర్టు అశోక్ గజపతి రాజు కు సింహాచలం బాధ్యతలు

0 13

అమరావతి   ముచ్చట్లు :
మాజీ మంత్రి, తెలుగు దేశం నేత అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్పర్సన్ నియామక జీవోను సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసింది. సింహాచలం వరహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అయన స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేసింది.  దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించింది. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను  ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:High Court quashes Jivo No.72
Simhachalam responsibilities to King Ashok Gajapati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page