డ్రైనేజ్ నీటితో కరెంట్ దిశగా అడుగులు

0 26

హైద్రాబాద్  ముచ్చట్లు :

 

మురుగు నీటి తో కరెంట్  ఉత్పత్తి చేసే దిశగా ఓ వినూత్న ప్రాజెక్టు కోసం జలమండలి కసరత్తు ప్రారంభించింది. మురుగు నీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) అవుట్‌లెట్లపై చిన్నపాటి టర్బైన్లు పెట్టి వాటితో అవసరమైన కరెంటును తయారు చేయాలని భావిస్తోంది.గతంలో జలమండలి అంబర్‌పేట, నాగోలు, అత్తాపూర్‌, నల్లచెరువు, నానక్‌రాంగూడ వద్ద మురుగు శుద్ధి కేంద్రాలు నిర్మించింది. ఇందులో అంబర్‌పేట 339 ఎంఎల్‌డీలు, నాగోలు 172 ఎంఎల్‌డీలు, అత్తాపూర్‌ 74 ఎంఎల్‌డీలు పెద్దవి. మొత్తం నగర వ్యాప్తంగా 1400 ఎంఎల్‌డీల మురుగు నీళ్లు నిత్యం ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ఈ మూడు ఎస్టీపీల ద్వారా 585 ఎంఎల్‌డీలు శుద్ధి చేస్తున్నారు. ఈ శుద్ధి నీళ్లు అన్ని అవుట్‌లెట్‌ గొట్టాల ద్వారా మూసీలో కలిసిపోతున్నాయి. ఆ ప్రాంతాత్లో చిన్న ఉత్పత్తి యూనిట్లు పెట్టడంతో ఎస్టీపీల నిర్వహణకు కావాల్సిన విద్యుత్తు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవేకాక హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల ద్వారా 14 ఎస్టీపీలను గతలో జలమండలికి అప్పగించారు. త్వరలో మరో పది భారీ ఎస్టీపీలు నిర్మించేందుకు జలమండలి ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కొత్త మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. ఇప్పటికే మంచినీటి పంపింగ్‌, సరఫరా కోసం జలమండలి నెలకు రూ.75 కోట్లు వరకు విద్యుత్తు ఛార్జీల భారం మోస్తోంది. భారం తగ్గించుకునేందుకు ఎస్టీపీలపై మినీ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ప్రతి ఎస్టీపీకి భారీ అవుట్‌లెట్‌ పైపు ఉంటుంది. అందులో నుంచి శుద్ధి అయిన మురుగు నీరు తీవ్ర ఒత్తిడితో బయటకు వస్తుంది. అందులో టర్బైన్లు పెట్టడం ద్వారా ఆ నీటి ఒత్తిడికి అవి తిరిగి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును అక్కడకక్కడ వాటి నిర్వహణకు వాడుకోవాలనేది యోచన.

ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా సాంకేతికత అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు నగరంలో అనువుగా ఉన్న పలు ఎస్టీపీలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నారు. తొలుత ప్రయోగాత్మక పరిశీలన కింద అంబర్‌పేట ఎస్టీపీ నుంచి అవుట్‌లెట్లపై టర్బైన్‌లు పెట్టాలనేది ప్రణాళిక. ఇక్కడ విజయవంతమైతే మిగతా ఎస్టీపీలకు విస్తరించనున్నట్లు జలమండలికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. పీపీపీ పద్ధతిలో వీటిని చేపట్టేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. దాదాపు 339 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో అంబర్‌పేట వద్ద మురుగునీటి కేంద్రం జలమండలి గతంలో ఏర్పాటు చేసింది. దీని నిర్వహణకు 1700 కిలోవాట్ల విద్యుత్తు అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ లభించే గ్యాస్‌ ద్వారా 800 కిలోవాట్ల విద్యుత్తు తయారు చేస్తున్నారు. మిగతా 900 కిలోవాట్ల విద్యుత్తును బయట నుంచి తీసుకుంటున్నారు. ఇలాంటి చోట ఈ మినీ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా అటు ఎస్టీపీల నిర్వహణతోపాటు విద్యుత్తు ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటున్నారు. ఒకవేళ పీపీపీ భాగస్వామం కాకుండా జలమండలి ఖర్చుతో వీటిని పెట్టిన సరే…మూడు నాలుగేళ్లలో విద్యుత్తు ఆదా ద్వారా పెట్టిన వ్యయం తిరిగి రాబెట్టుకోవచ్చునని పేర్కొంటున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Steps towards the current with drainage water

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page