దళిత మహిళా ఉద్యోగిపై దాడి హేయనీయం   ఐహెచ్ఆర్ఏ స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు

0 25

గుంటూరు ముచ్చట్లు :

 

 

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దళితులు అణగారిన వర్గాలపై అధికార పక్షానికి చెందిన వారు దాడులకు పాల్పడం పరిపాటిగా మారిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు పేర్కొన్నారు.గుంటూరు దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో  నెల 11 న రామన బోయిన పవిత్ర తన ఇంటి ప్రక్కన గల ఖాలీ స్థలాన్ని  కొందరు ఖబ్జా చేయడం తో వెళ్లి అడిగినందుకు దళిత మహిళ  పై దాడి కి పాల్పడటం హేయనీయమన్నారు.ఇట్టి విషయమై   ఈ నెల 13 న ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు జిల్లా చైర్మన్  పులిమిల సత్యం జిల్లా కమిటీ మెంబర్ పి.రాము బృందం తో కూడిన  నిజనిద్దారాణ కమిటీ వెళ్లి పూర్వాపరాలను పరిశిలించినట్లు తిరుపతి నాయుడు తెలిపారు. అడిగొప్పల గ్రామంలో  గుట్ట మీద సెంటరు  వద్ద 03 సెంట్లు భూమిలో ఒక సెంటు లో ఇల్లును నిర్మించుకున్నారని మిగత స్థలాన్ని లోకల్ పార్టి నాయకులు  కబ్జా చేయాలని  దురద్దేశంతో  మహిళ  అని కూడా చూడకుండా ఆమె పై దాడి చేసి నడి రోడ్డులో  ఆమె జాకెటు చింపి మానవ విలువలను మంట కలిపి నారని పేర్కొన్నారు.ఒక దళిత మహిళ పై దాడి జరుగడం నిజమేనని నిజ నరి్దారణ కమిటీ నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు..

 

ఈ క్రమములోవారు  విలేకర్లు తో మాట్లాడుతూ సంఘటన జరిగిన స్థలం నుండి బాధితురాలు 100 నెంబరుకు పోన్ చేసినప్పటికి సంఘటనా స్థలానికి  పోలీస్ సిబ్బంది. రాకపోవటం  అనేది విచారించ జరిగిన విషయము నాలి శ్రీను, నాళి.రామయ్య, కందుకూరి , వెంకయ్య వీరు  అదికార పార్టి నాయకులు మరియు సభ్యులు అయినందున  పోలీసులు సాటి మహిళలోకం  అన్యాయం జరిగినప్పటికి పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి రాకపోవటం అధికార దుర్వినియోగం అని ఇది పూర్తిగా రాజ్యాంగా  ప్రాధమిక  హక్కులకు విరుద్దం అని ప్రమాదకరమన్నారు. సాటి మహిళ అడిగొప్పల  గ్రామంలో  సచివాలయం-2 లో  ఎ.ఎన్.యం. గా విదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి వారిపై సి.ఐ. రూరర్ మాచర్ల భక్త వత్సల రెడ్డి  దుర్గి ఇన్ చార్జి ఎస్.ఐ. ఉదయ లక్ష్మి ఎలాంటి చర్య తీసుకోక పోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. ఈ విషయంను  గుంటురు జిల్లా  రూరల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్  (ఎస్.పి) వారికి  మరియు జాతీయ మానవ  హక్కుల  సంఘం  చైర్మన్ న్యూడిల్లీకి  ఫిర్యాదు చేస్తామని  జిల్లా  చైర్మన్  పి.సత్యం  తెలిపారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Attack on Dalit female employee is heinous
IHRA State Civil Rights Chairman Karanam Tirupati Naidu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page