దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉంది-అశోక్ గజపతిరాజు

0 16

విజయనగరం ముచ్చట్లు:

– దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైందని  మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ , మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.  వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది.  ఉదాహరణకు  సింహచలం దేవస్థానం లో గోశాల లో గోవుల ప్రాణాలు పోయాయి.  వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారు.  వాటి ప్రాణాలు ఎవరు తెస్తారు?  అలాగే 105 ఈమధ్య కాలంలో  దేవాలయాల్లో పరిస్థితులు చూడాలని అన్నారు. ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని  రిస్టోర్ చేయాల్సి ఉంది.  ప్రభుత్వం కూడా ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూడాలి.  ట్రస్టు చైర్మన్ తో పాటు సింహచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి నుంచి తొలగించారు.  డిస్మిస్  ఆర్డర్ ఇచ్చారు.  వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసిందని అన్నారు.నాపై ఆరోపణలు హాస్యాస్పదం.  నేను రామతీర్ధాలు దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపారు.  నేను చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయి అని వాదించారు.  ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారు.  ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను.  అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి.  కోర్టు తీర్పు పూర్తి పాఠం వొచ్చినాక మిగతా వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: There are laws in the country, there is a constitution-Ashok Gajapatiraju

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page