ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొనడంతో దంపతులు మృతి..

0 12

భద్రాచలం ముచ్చట్లు :

కుక్కునూరు మండలం,  ఉప్పేరు పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా, గాయపడిన సంఘటన కుక్కునూరులో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే.. అశ్వాపురం గ్రామంలో నివాసం ఉంటున్న గుత్తా ప్రసాద్ (50),  భవాని(45)లు తమ  స్వగ్రామమైన కొండపల్లి గ్రామం వచ్చి వెళ్తున్న క్రమంలో పుల్లప్పగూడెం గ్రామంలోని రైస్ మిల్లు వద్దకు చేరుకునేసరికి ఎదురుగా  ఎర్టిగా కారు మితిమీరిన వేగంతో వస్తూ ఢీ కొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని హుటాహుటిన అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అమరవరం ప్రభుత్వాస్పత్రికి  భారీగా చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతుల పరిస్థితి విషమంగా ఉందని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో దంపతులు మృతి చెందారు.కుక్కునూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:The couple was killed when their car collided with a two-wheeler.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page