పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలి…… ఎన్ ఎస్ యు ఐ  రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్

0 21

ఎమ్మిగనూరు   ముచ్చట్లు :

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు తీవ్రం అవుతున్న దృష్ట్యా పదవతరగతి ఆన్లైన్ క్లాస్ లను రద్దుచేసి , గత సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ ఆధ్వర్యంలో  ఎన్ఎస్యుఐ రాష్ట్ర స్థాయి పిలుపుమేరకు  జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం తన ఛాంబర్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల విద్యార్థులు పైగా పదవతరగతి పరీక్షలు రాస్తున్న దృష్ట్యా పరీక్షలను రద్దు చేసి , విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని,  దేశంలో అనేక రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిందని, ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం పరీక్షల రద్దు పై స్పష్టమైన వైఖరి ఇవ్వడం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి కేవలం మీడియా ప్రకటనలు మాత్రమే పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పడం చాలా విడ్డూరమన్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఒకవైపు విద్యార్థి సంఘాలు పాఠశాల పై ఆందోళన నిర్వహిస్తున్న  ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు .పరీక్షలో నిర్వహిస్తే అనేక మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోన  వచ్చే ప్రమాదముందని, ఉపాధ్యాయులు కూడా పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా లేనప్పటికీ  పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు చెప్పడం తగదని ,నిపుణులు చెప్పే విధంగా మూడవ దశ కరోన  పిల్లలకు ఎక్కువగా సోకుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేయాలని లేనిపక్షంలో, విద్యా శాఖ మంత్రిని అడ్డుకుని,తన కార్యాలయాన్ని   ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ముట్టడిస్తామని తెలిపారు.  దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పది పరీక్షల విషయంపై రాష్ట్ర స్థాయి అధికారులకు తెలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వసతిగృహాల రాష్ట్ర కన్వీనర్ వీరేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ధోని  రాజు ,అశోక్ కుమార్, మన్సూర్, రవి,బాలు,తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Tenth class exams should be canceled ……
NSUI state president Naga Madhu Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page