పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

0 10

శ్రీకాకుళం  ముచ్చట్లు :
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీన్ ఆర్మీకి జాతీయ పురస్కారం ప్రధాన కార్యక్రమం మరియు పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ మన రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు చేతుల మీదగా అందించడం జరిగింది. మంత్రివర్యులు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులు,  పారిశ్రామికవేత్తలు, సంఘ సేవకులు మరియు వివిధ రంగాల్లో ఉన్న వారంతా కలిసి గ్రీన్ ఆర్మీ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు అందివ్వడం చాలా ఆనందంగా ఉందని, గత సంవత్సర కాలంలో మన పలాస నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కరోనా కష్ట సమయంలో విశేషమైన సేవలు అందివ్వడం జరిగిందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం లో కానీ, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో గాని అలాగే యువకులకు స్ఫూర్తినిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రీన్ ఆర్మీ ముందుకు వెళ్తుందని ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న గ్రీన్ ఆర్మీ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అవార్డు గ్రహీతలకు  అలాగే గ్రీన్ ఆర్మీ టీం కి  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని అన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:Distribution of daily necessities to sanitation workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page