పెళ్లి చేసుకుంటానని బెదిరింపు… అంతలోనే

0 25

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటాననడంతో పెద్దలను కలిశారు. మైనార్టీ కూడా తీరకుండా ఇప్పుడే పెళ్లేంటని తండ్రి తీవ్రంగా మందలించడంతో కూతురు అలిగి హైదరాబాద్‌లోని అక్క ఇంటికి వచ్చేసింది. కంగారుపడిన తండ్రి వెంటనే ఊరికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ప్రియుడు ఆమె వెనకేహైదరాబాద్ వచ్చాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ కన్నతండ్రి ముందే ప్రియుడు బెదిరింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై దారుణ నిర్ణయం తీసుకుంది. ఈలోకం విడిచి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన నగరంలోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.తూర్పు గోదావరి జిల్లా రౌతులపైడి గ్రామానికి చెందిన శ్యాంసన్ కూతురు దుర్గాభవానీ(16)ని అదే గ్రామానికి చెందిన కల్యాన్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే విషయం తండ్రి శ్యాంసన్‌కు చెప్పడంతో తీవ్రంగా మందలించాడు. అందులోనూ మైనార్టీ కూడా తీరకుండా పెళ్లేంటని గదమాయించాడు. తండ్రి కోప్పడడంతో అలకబూనిన కూతురు దుర్గాభవానీ చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చేసింది.తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వెంటనే హైదరాబాద్ వచ్చాడు. కూతురు దుర్గాభవానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వెనకే వచ్చిన ప్రియుడు కల్యాన్ కన్నతండ్రి ముందే బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోకపోతే తండ్రితో సహా దుర్గాభవానీకి కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో దుర్గాభవానీ తీవ్ర మనస్థాపానికి గురైంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు బయటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఆమె ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Threatening to get married … meanwhile

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page