బాబుపై విజయసాయి హాట్ కామెంట్స్

0 21

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నేతవిజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబును ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పెద్ద తోపేం కాదని, రాజకీయాల్లో కోవర్టు వ్యవస్థను ప్రవేశ పెట్టి పెంచి పోషిస్తోందని ఆయనేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం వరుస ట్వీట్లు చేశారు.రాజకీయాల్లో కోవర్టు వ్యవస్థను ప్రవేశ పెట్టి పెంచి పోషిస్తున్నది చంద్రబాబే. అన్ని పార్టీల్లోకి, వ్యవస్థల్లోకి తన మనుషులను పంపించడం చూస్తూనే ఉన్నాం. వాళ్లంతా దాపరికం లేకుండానే ఆయన కోసం పనిచేస్తుంటారు. దుమ్ముకొట్టుకు పోయిన పచ్చ పార్టీలో కోవర్టులను పంపే అవసరం ఎవరికి ఉంటుంది?ఎన్డీఏ కన్వీనర్‌గా చక్రం తిప్పిన రోజుల్లో కూడా బాబు పెద్ద తోపు ఏం కాదు. పవర్ బ్రోకర్ ఇమేజ్ అతనిది. విద్యుత్తు కంపెనీలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు ఫ్లైట్లలో దిగి డబ్బు సంచులు అందించడం ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు పత్తిగింజలా మాట్లాడుతున్నాడు.తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నప్పుడు చాలా మంది విచక్షణ కోల్పోతారు. ప్రజల తిరస్కారంతో పొరుగు రాష్ట్రంలో ఆశ్రయం. ప్రతి ఎన్నికా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కనుచూపు మేరలో సానుకూలత కనిపించని పరిస్థితి. బాబు, ఆయన బానిస మీడియా శోకాలు పెట్టడం తప్ప చేయగలిగేదేం ఉంటుంది.’’ అంటూ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Vijayasai hot comments on Babu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page