మహారాష్ట్ర ఠాణేలోని ఓ పెట్రోల్ బంక్ లో రూపాయికే లీటర్ పెట్రోల్

0 9

ముంబాయి ముచ్చట్లు :
మహారాష్ట్ర ఠాణేలోని ఓ పెట్రోల్ బంక్ లో రూపాయికే లీటర్ పెట్రోల్ విక్రయించారు.మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు. రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆధిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే వేడుకలను శివసేన శ్రేణులు వినూత్నంగా నిర్వహించాయి. ఠాక్రే జన్మదినం సందర్బంగా ఠాణేలోని ఉస్మా పెట్రోల్ బంక్ లో శివసేనకు చెందిన డోంబివలీ యువసేన ఈ కార్యక్రమం చేపట్టింది.దీనికి అదిరిపోయే స్పందన వచ్చింది. వాహనదారులు కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లు కట్టడం విశేషం.దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. మోడీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా చేయాలని ఆలోచించిన శివసేన శ్రేణులు అదే సందర్భంలో వచ్చిన ఠాక్రే పుట్టినరోజును దీనికి వాడుకున్నారు. దెబ్బకు మోడీ సర్కార్ పై ప్రతీకారంతోపాటు ఆధిత్య ఠాక్రే పేరు మారుమోగించేలా శివసేన అభిమానులు ఇలా రూపాయికే అందించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

- Advertisement -

Tags:A liter of petrol costs a rupee at a petrol bunk in Thane, Maharashtra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page