మూడు సార్లు పూర్తయిన సర్వే

0 26

హైదరాబాద్  ముచ్చట్లు :
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కాబోతుంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక తప్పదు. ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన ఆరు నెలల్లోపు ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ మరోసారి పోటీ చేసి తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ కాకున్నా ఆయన కుటుంబం నుంచి ఒకరు బరిలో ఉంటారని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ ఈటల రాజేందర్ పై ఎవరిని బరిలోకి దింపుతున్నది చర్చనీయాంశంగా మారింది.నాగార్జున సాగర్ లో మాదిరిగా హుజూరాబాద్ లోనూ మరోసారి గెలవాలన్నది కేసీఆర్ లక్ష్యం. దీంతో పార్టీలో అసంతృప్తి ఉన్నవారికి చెక్ పెట్టే వీలుంటుంది. అందుకే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు పోటీగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇప్పటి నుంచే దీనిపై కసరత్తులను కేసీఆర్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.

ఏ ఎన్నికైనా తొలుత కేసీఆర్ సర్వేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.సర్వేల నివేదికల ప్రకారం కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మూడు దఫాలుగా హుజూరాబాద్ లో సర్వే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రయివేటు సంస్థకు అప్పగించారని తెలిసింది. గెలుపు అవకాశాలతో పాటు అభ్యర్థుల పేర్లను కూడా సర్వే సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాలుగా నివేదికలను చూసిన తర్వాతనే అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయనున్నారు.అయితే హుజూరా బాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మన్ వినోద్ కుమార్ పేరు పరిశీలనతో ఉందంటున్నారు. అలాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజిని పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. వీరిద్దరు కేసీఆర్ సామాజికవర్గం కావడంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అందుకే గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి పేరును కూడా కేసీఆర్ పరిశిలిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద సాగర్ వ్యూహం తరహాలోనే అభ్యర్థిని చివరి నిమిషంలోనే కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Survey completed three times

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page