మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన

0 10

కోరుట్ల  ముచ్చట్లు :

 

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక వాసవీ కళ్యాణ భవనంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన వచ్చింది.ఈ సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరంలో కోరుట్ల పట్టణం మరియు పరిసర గ్రామాలకు చెంది‌న 65 మంది రక్తదాతలు పాల్గొనగా 42 మంది స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానం చేసినట్లుక్లబ్ అధ్యక్షుడు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతలకు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల పక్షాన రక్తదాన ప్రశంసా ప్రత్రాలను అందించారు.ఆనంతరం  లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు మంచాల జగన్ మాట్లాడుతూ కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులలో జిల్లా కేంద్రం లోని రక్తనిధి కేంద్రం
లో రక్త నిలువలు కొరత ఏర్పడడంతో  ప్రసూతి కోసం గర్భిణీ లు, ప్రమాదాల బారిన పడినవారికి సరియైన స్థలంలో, సరియైన సమయంలో రక్తం దొరకక మృత్యువాతకు గురవుతున్నారని అందుకే ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని, రక్తధానం మానవత్వం పరిమలించిన స్వచ్ఛంద రక్తదాతల ద్వారానే దొరుకుతుందని ప్రపంచంలో ఇంతగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ రక్తం ఏ శాస్త్రవేత్త తయారు చేయలేడనీ అన్నారు.

- Advertisement -

ఆనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి, రక్తదాన శిబిరాలు నిర్వహించే యువజన సంఘాల నాయకులకు మెమొంటో,శాలువాలతో ఘనంగా సన్మానించారు. రక్తదానం చేసినవారిలో క్లబ్ కార్యదర్శి కొమ్ముల జీవన్ రెడ్డి, ఎక్కల్ దేవి సుధాకర్, పోల రఘునందన్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మిట్టపల్లి రాజేష్, స్నేహాలయ యూత్ అధ్యక్షులు కోట కిరణ్ కుమార్(మెట్పల్లి) సాడిగే మహేష్, యాటం క్రిష్ణ మల్లయ్య తదితర ప్రముఖులు ఉన్నారు.‌కట్కం గణేష్, వాసాల గణేష్, జాల వినోద్, సనావుద్దిన్,పుప్పాల నాగరాజు,రుద్ర విష్నేష్, సాడిగే మహేష్, అతీక్, ఆమెర్, పంచిరి విజయ్ కుమార్, జిల్ల మణిరాజ్, ఫసియొద్దిన్,ఆనంద్, శేఖర్,సుజాయిత్ లకు సన్మానించారు .ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ అల్లాడి ప్రవీణ్,కార్యదర్శి కొమ్ముల జీవన్ రెడ్డి, కోశాధికారి  గుంటుక మహేష్,  వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గండ్ర దిలీప్ రావు, జిల్లా నాయకులు గుంటుక చంద్ర ప్రకాష్, ఆడెపు మధు, చాప కిషోర్,  ఎలిమిల్ల ఉషా కిరణ్, దండంరాజ్ స్వరాజ్, ఎ.రాంనారాయణ, దుబాయ్ శీను, నల్ల గంగాధర్,  బైరి విజయ్ కుమార్, పొలాస రవీందర్, చలిగంటి వినోద్ కుమార్, గండ్ర అజయేందర్ రావు, పిడుగు గుణాకర్ రెడ్డి, వెగ్యారపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Special response to the mega blood donation camp

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page