యాదాద్రికి ఎర్రబెల్లి

0 8

నల్గొండ ముచ్చట్లు:

 

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రానికి మ‌కుటాయ‌మానంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి పునర్నిర్మాణ కట్టడాలను పరిశీలించారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల లోని భక్తుల కోసం యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా పునః నిర్మిస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునః నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉండే విధంగా చూడాలని స్వామిని ప్రార్థించానని ఆయన తెలిపారు. అంతకు ముందు ఆలయ అధికారులు, పురోహితులు మంత్రి దయాకర్ రావుకు స్వాగతం పలికారు.

 

 

- Advertisement -

డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభం…

 

పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల‌న్న ల‌క్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డయోగ్నస్టిక్‌ సెంట‌ర్‌ను ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ రాజయ్య తో కలిసి మంత్రి సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం మంత్రి రక్త పరీక్ష చేయించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకు రావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.కరోనా వంటి వ్యాధుల నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని  అయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరు వీటిని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

నూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Yadrabri Errabelli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page