రమణతో మాటలా… నో.. వద్దు

0 18

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారంతో టీఆర్ఎస్‌తో పాటు పలు పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్‌లోకి టీటీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ వస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి నేడు హైదరాబాద్‌కు రానున్నారు రమణ. భవిష్యత్ కార్యచరణపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రెండు రోజులుగా జగిత్యాలలో ఉన్న రమణ తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించారు. పార్టీ మారటానికి ఇదే సరైన సమయమని సన్నిహితులు రమణకు చెప్పినట్లు సమాచారం.తమ పార్టీలో చేరాల్సిందిగా టీబీజేపీ నేతలు ఆహ్వానం పలుకగా…అధికార టీఆర్ఎస్ వైపే టీటీడీపీ అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి భవిష్యత్‌ లేదని పార్టీ మారడమే మంచిదని కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తోంది.మరో వారం రోజుల్లో రమణ గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. తాను పార్టీ ఎందుకు మారుతున్నానో టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వివరించాలని రమణ అనుకున్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు రమణను కలిసేందుకు విముఖత చూపినట్టు సమాచారం. రెండు రోజుల్లో ఎల్‌. రమణ మంత్రి ఎర్రబెల్లితో భేటీకానున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన రమణ…. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరికపై ప్రకటన చేసే అవకాశముంది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Talk to Ramana … no .. no

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page