రేవ్ పార్టీకి మించి 

0 9

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కడ్తాల్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ నిర్వహించుకుంటున్నా పదిహేను జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన 30 మంది యువతీ యువకులు పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా రేవ్ పార్టీ పై దాడి చేశారు. అందర్నీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ సంబంధించిన వారంతా ఉన్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. రాత్రి మద్యం సేవిస్తూ, డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ చిందులు వేస్తూ, డాన్సులు చేశారు. ఎస్‌వోటీ పోలీసులు, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్‌పై రాత్రి 11.30 గంటలకు దాడులు నిర్వహించారు.నిర్వాహకుల్లో ఒకరైన వరుణ్‌గౌడ్‌ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్‌ యజమాని భరత్‌ ఏ-1, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్‌ అలీఖాన్‌ ఏ-2, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అన్వేష్‌ ఏ-3, పరారీలో ఉన్న వరుణ్‌గౌడ్‌పై ఏ-4గా కేసు నమోదు చేశారు. అయితే ఈ పార్టీ బర్త్‌డే పార్టీ అని చెబుతున్నా… అలా ఏ మాత్రం లేదని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో… రేవ్ పార్టీకి మించి ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Beyond the rave party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page