లూజు,  దళారీలు అమ్మే విత్తనాలతో జాగ్రత్త… ఏడిఏ మహమ్మద్ ఖాద్రి

0 8

తుగ్గలి/మద్దికెర   ముచ్చట్లు :

ప్రస్తుతం ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలులో పూర్తి జాగ్రత్త వహించాలని పత్తికొండ ఏ డి ఏ మహమ్మద్ ఖాద్రి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు దళారులు,లూజు విత్తనాలు అమ్మి  మోసం చేస్తుంటారు.అసలు లూజు మరియు కంపెనీల ద్వారా అమ్మే విత్తనాల తేడాలు తెలుసుకుంటే చాలా మంచిది.
వాటి వివరాలు పత్తికొండ సహాయ వ్యవసాయ సంచాలకులు షేక్ మహమ్మద్ ఖాద్రి  మాటలలో….

- Advertisement -

దళారుల ద్వారా అమ్మే లూజు  విత్తనాలు…

* ఈ విత్తనములు తయారీలో కంపెనీ వారి, ధ్రువీకరణ అధికారుల ప్రమేయం ఉండదు.
* ఈ విత్తనాలు అమ్మినప్పుడు  ఎటువంటి బిల్లును ఇవ్వరు.
* ఈ విత్తనాల తయారీలో ఎటువంటి ప్రాసెసింగ్,  శుద్ధి మరియు ఇతర ప్రమాణాలు పాటించరు.
* ఈ విత్తనాలకు ఎటువంటి నాణ్యత ఉండదు.
* ఈ విత్తనాలకు ఎటువంటి జన్యు నాన్యత  ఉండదు.
*  ఈ విత్తనాలను విత్తినప్పుడు  మరియు పంట మధ్యకాలంలో,  పూత కాత దశలో ఏమైనా నష్టాలు జరిగిన రైతుకు న్యాయం జరగదు.
*  ఈ విత్తనాలను దళారీలు రైతులను మోసం చేసే వారు మాత్రమే విక్రయిస్తారు.

కంపెనీ ద్వారా మరియు డీలర్ల ద్వారా అమ్మే  విత్తనాలు…

* ఈ విత్తనము తయారీలో వివిధ దశలలో కంపెనీ మరియు ధ్రువీకరణ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.
* ఈ విత్తనాలను అమ్మినప్పుడు రైతులకు తప్పకుండా బిల్లు ఇస్తారు.
*  ఈ విత్తనాల తయారీలో ప్రాసెసింగ్,  శుద్ధి మరియు ఇతర నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు.
*  ఈ విత్తనాలకు పూర్తి నాణ్యత ఉంటుంది.
* ఈ విత్తనములకు  ఖచ్చితమైన జన్యు నాణ్యత  ఉంటుంది.
* ఈ విత్తనాలు అమ్మినప్పుడు రైతులకు బిల్లులు ఇస్తారు కాబట్టి రైతులకు పూర్తి న్యాయం జరుగుతుంది.
* ఈ విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్సు పొందిన డీలర్లు విక్రయిస్తారు.

కావున రైతు సోదరులు అందరూ లైసెన్సు కలిగిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రసీదు లేదా బిల్లు పొంది పంటకాలం పూర్తయ్యేవరకూ జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలి. అలాగే గ్రామాలలో ఎవరైనా లూజు విత్తనాలను  అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వగలరు. విత్తనాల కొనుగోలు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి

విత్తన కొనుగోలులో..

* వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
* విత్తన కొనుగోలు బిల్లుపై నెంబర్, విత్తన రకం, గడువు తేదీలు, డీలర్ సంతకం, రైతు సంతకం బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
* లూజుగా ఉన్న సంచులు, పగిలిన పాకెట్స్, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనొద్దు.
* గడువు దాటిన విత్తనాల జోలికి వెళ్ళవద్దు.
* బిల్లుపై విక్రయదారుడి పేరు, రైతు పేరు, గ్రామం పేరు, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చెయ్యాలి.
* విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలు తీసుకొని వాటిలో పేర్కొన్న అంశాలను చదవాలి.
* విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు దాచి పెట్టుకోవాలి.
* అరువు పద్దతిలో కొనొగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని యస్.యం.డి. ఖాద్రి,సహాయ వ్యవసాయ సంచాలకులు రైతులకు తెలియజేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Beware of loose, brokers selling seeds …
ADA Mohammad Qadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page