విద్యా వాలంటీర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి     నిరుద్యోగ జాక్ ఆద్వర్యం లో  విద్యా శాఖ డైరెక్టరేట్ ముట్టడింపు

0 17

హైదరాబాద్    ముచ్చట్లు :

ప్రభుత్వ పాటశాలల్లో పని చేస్తున్న 16 వేల మంది విద్యా వాలంటీర్లకు  గత 14 నెలల జీతాలు చెల్లించాలని,  డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ ఆద్వర్యం లో  విద్యా శాఖ డైరెక్టరేట్ ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రసంగించారు.ముట్టడినుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు పాటశాలలో పని చేసే  2 లక్షల 20 వేల మంది టీచర్లకు నెలకు 2 వేల రూ. మరియు 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. కాని ప్రభుత్వ పాటశాలలో పనిచేసే 16 వేల మంది విద్యా వాలింటర్లకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఉదారంగా ప్రైవేటు టిచర్లను ఆదుకోలేదు. కేవలం మన ముఖ్యమంత్రి KCR ప్రైవేటు టిచర్లను ఆదుకున్నారు. 2 లక్షల 10 వేల మంది ప్రైవేటు టిచర్లను ఆదుకున్న ముఖ్యమంత్రి – ప్రభుత్వ పాటశాలలో పనిచేసే 16  వేల మంది విద్యా వాలింటర్లను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పైగా వీరు ప్రభుత్వ పాటశాలలో పనిచేస్తూన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఈ వాలింటర్ల కుటుంబాలు ఎదుర్కుంటున్న కష్టాలను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.నీల వెంకటేష్ మాట్లాడుతూ 2020 మార్చ్ 23 నుండి కోవిడ్ -19 వ్యాప్తి  కారణంగా పాఠశాలలు మూసివేయడం వలన  14 నెలలుగా పెండింగ్ వేతనాలు రాకా, వేరే  పని దొరక్క కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.  కావున ముఖ్యమంత్రి స్పందించి ఈ విద్యా వాలింటర్ల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.ఈ ముట్టడిలో గుజ్జ కృష్ణ,  రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి పగిడాల సుధాకర్, విద్యార్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు జిల్లపల్లి అంజి, చంటి ముదిరాజ్,   ఆర్.చంద్రశేఖర్ గౌడ్,పి.సుచిత్ కుమార్, జక్కుల కోటేశ్వరరావు, భరత్ శివ లాల్, అఫ్సా, దమయంతి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Educational volunteers should be paid salaries immediately
Invasion of the Directorate of Education under the auspices of the unemployed Jack

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page