సమర్ధవంతంగా నోవావాక్స్

0 16

న్యూయార్క్ ముచ్చట్లు:

 

నోవావాక్స్ కోవిడ్ టీకా 90 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలింది. అన్ని ర‌కాల వేరియంట్ల‌పై త‌మ టీకా ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తుంద‌ని ఆ కంపెనీ పేర్కొన్న‌ది. అమెరికా, మెక్సికోలో జ‌రిగిన భారీ స్థాయి అధ్య‌య‌నాల ద్వారా వెల్ల‌డైన‌ట్లు నోవావాక్స్ పేర్కొన్న‌ది. ప్రాథ‌మిక డేటా ఆధారంగా వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్థ‌వంత‌మైంద‌ని, సుర‌క్షితంగా కూడా ఉన్న‌ట్లు నోవావాక్స్ చెప్పింది. నిజానికి అమెరికాలో కోవిడ్ టీకాల‌కు డిమాండ్ త‌గ్గింది. కానీ ప్ర‌పంచ దేశాల్లో ఆ టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. నోవావాక్స్ టీకాల‌ను సులువుగా నిల్వ చేయ‌వ‌చ్చు. ట్రాన్స్‌పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది.ప్ర‌పంచ దేశాల్లో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా డిమాండ్‌ను అందుకోవ‌డంలో నోవావాక్స్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ఆ కంపెనీ చెప్పింది. సెప్టెంబ‌ర్ చివ‌రినాటికి అమెరికా, యూరోప్‌, ఇత‌ర దేశాల్లోనూ త‌మ టీకాల‌కు అనుమ‌తి ద‌క్క‌నున్న‌ట్లు నోవావాక్స్ తెలిపింది. నెల‌కు 10 కోట్ల టీకాల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఆ కంపెనీకి ఉన్న‌ది. దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి దేశాల‌కు తొలుత త‌మ టీకాలు వెళ్తాయ‌ని నోవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లే ఎర్క్ తెలిపారు. 18 ఏళ్లు దాటిన సుమారు 30 వేల మందిపై నోవావాక్స్ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. వీటిల్లో మూడ‌వ వంతు ప్ర‌జ‌లు మూడు వారాల వ్య‌వ‌ధిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. యూకే వేరియంట్‌పై నోవావాక్స్ ప‌నిచేస్తుంద‌ని తేలింది. సాధార‌ణ ఫ్రిడ్జ్‌లో ఈ టీకాల‌ను నిల్వ చేయ‌వ‌చ్చు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Effective Novavax

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page