హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

0 38

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ హైపర్‌ ఆది డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందిన విషయం విదితమే.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Complain to the police on hyper‌adi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page