5వ లేఖ రాసిన రఘురామ

0 28

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీ సర్కారుపై నర్సాపురం ఎంపీరఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా రఘురామ లేఖలు రాస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు‌, పెళ్లికానుక..షాదీముబారక్‌, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ అంశాలను ప్రస్తావించిన ఆయన తన ఐదో లేఖలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ప్రస్తావించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది అగ్రిగోల్డ్ బాధితుల‌కు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో రఘురామ గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన నెరవేరని హామీలను రఘురామ లేఖల ద్వారా గుర్తుచేస్తున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: 5th letter written by Raghurama

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page