అప్పలాయగుంటలో ఏకాంతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

0 17

-జూన్ 19 నుంచి ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

 

జూన్ 19 నుంచి ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు….

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. జూన్ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య సింహ ల‌గ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల‌ వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

 

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Koil Alwar Thirumanjanam in solitude in Appalayagunta

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page