అవ గాహన విధులు నిర్వహించండి

0 17

-కార్మికులకు వేతనాల పెంపుకు కృషి
-మున్సిపల్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్‌.వర్మ

 

బి.కొత్తకోట ముచ్చట్లు:

 

- Advertisement -

మున్సిపల్‌ పాలనపై అవగాహ పెంచుకొని విధులును నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పుంగనూరు కమీషనర్‌ కేఎల్‌.వర్మ కోరారు. మంగళవారం బి.కొత్తకోట కొండ కళ్యాణ మంటపంలో నగరపంచాయతీ పాలనపై సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలు, కార్యదర్శులు, పారిశుద్ద్య కార్మికులకు పాలనపై అవగాహన క ల్పించారు. ఎవరి విధులు ఎలా ఉంటాయి, ఎలా పనిచేయాలి, సమన్వయం ఎలా చేసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. ఎవరి విధులను వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తే సమస్యలే ఉండవని, ఫిర్యాదులు ఆగిపోతాయని అన్నారు. పారిశుద్ద్యం, వీధిలైట్లు, నీటి సరఫరా విభాగాల నుంచి ఫిర్యాదులు రాకుంటే సగం సమస్యలు పరిష్కారం అయినట్టేనని అన్నారు. పింఛన్ల పంపిణి మెప్మా పరిధిలోకి వెళ్తుందని అన్నారు. పారిశుద్ద్య కార్మికులకు వేతనాలు పెరగాల్సివుందని చెప్పారు. పంచాయతీ పాలనలో రూ.10వేల వేతనం ఇస్తుండగా ప్రస్తుతం రూ.6వేల ఆరోగ్య అలవెన్సు కలిపి రూ.18వేలకు పెరగాలని, ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నగర పంచాయతీకి మంచి భవిష్యత్తు ఉందని, అన్నివిధాల అభివృద్దికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎంపి మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి సహకారం అందిస్తున్నారని అన్నారు. ఉద్యోగులు యూనియన్‌లో చే రాలని కోరారు. సంఘ పరంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. త్వరలోనే నగర పంచాయతీకి పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరుగుతుందని చెప్పారు. అకౌంట్స్ విభాగం సంయుక్త కార్యదర్శి పీఆర్‌.మనోహర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటిల్లో కీలకమైన విభాగం అకౌంట్స్ నిర్వహణపై అవగాహన కల్పించారు. లోటుపాట్లు లేకుండా రికార్డుల నిర్వహణపై వివరించారు. రాయలసీమ జోన్‌ ఫోర్త్క్లాస్‌ ఎంప్లాయూస్‌ యూనియన్‌ సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాసగౌడ్‌, రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.వెంకట్రామయ్యలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విధులను వివరించారు. అనంతరం పారిశుద్ద్య కార్మికులు పాపన్న తదితరులను వారి సేవలకు గుర్తింపుగా సత్కరించారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Perform excavation functions

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page