ఆర్డీఎస్‌ కాల్వకు గండి.. వృథాపోతున్న నీరు

0 6

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్‌ (రాజోలి బండ డైవర్షన్‌ స్కీం) కాల్వకు గండిపడింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో 34వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కాల్వకు గండిపడటంతో నీరు వృథాపోతున్నది. జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో ఆర్డీఎస్‌ కాల్వకు అధికారులు నీటిని వదిలారు. వరద ఉధృతి కారణంగా ఈ మధ్యాహ్నం కాల్వ కోతకు గురైంది. స్థానిక రైతులు విషయాన్ని నీటిపారుదల అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. కాల్వకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

- Advertisement -

Tags:Go to the RDS canal .. Waste water

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page