ఇరు గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన మట్టి వివాదం

0 8

విశాఖపట్నం ముచ్చట్లు:

 

యస్ రాయవరం మండలంలోని రెండుగ్రామాల మద్య మట్టి వివాదం చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళ్తే కర్రివానిపాలెం రెవెన్యూ పరిధిలోని ఉప్పరాపల్లి చెరువునుండి ఉప్పరాపల్లి గ్రామ రైతులు పొలాలకు మట్టి తరలిస్తున్నారు. అదే చెరువు నుండి వాకపాడు గ్రామానికి చెందిన వారు మట్టి తరలిస్తుండగా, ఈ నెల ఆరవ తేదీన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఉప్పరాపల్లికి చెందిన ఓ  వ్యక్తికి చేయి కాలు వేలు విరిగిపోయాయి. ఈ విషయమై ఇరు గ్రామాల పెద్దలు ఉప్పరాపల్లిలో సోమవారం  సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పిటు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఈ గొడవకు మూలకారణం అయిన వాకపాడుకు చెందిన యువకుడు సమావేశంనకు కారులో కత్తి పట్టుకుని రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కత్తి పట్టుకుని వచ్చిన యువకుని చూసి ఆగ్రహించిన గ్రామస్థులు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆ యువకుడు కారుతో పరారైయ్యే సమయంలో వెనుకకు పోనిచ్చాడు. దీంతో వెనుకన వున్న బాలుడుకి కాలు విరిగింది. దీంతో గ్రామంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి విషయం తెలుసుకున్న స్థానిక యస్ ఐ చక్రధర్ తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్య వుంటే ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. గాయపడిన బాలుడిని బంధువులు నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుత కోవిడ్ నిబంధనలను పాటించకుండా పదుల సంఖ్యలో గ్రామస్తులతో గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేయడంపై కొంతమంది గ్రామ పెద్దల పై మండిపడ్డారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:A land dispute between the two villages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page